స్టార్ డైరెక్టర్ విడుదల చేయనున్న”దొరసాని” ట్రైలర్

Published on Jun 29, 2019 1:03 pm IST

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘దొరసాని’.హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతుంది.ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ తో పాటు,పాటలకు ప్రేక్షకులనుండి మంచి స్పందన లభించింది. ఈ చిత్ర ట్రైలర్ ని టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన సుకుమార్ చేతుల మీదుగాజులై 1న విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ ప్రకటన పోస్టర్ ని విడుదల చేశారు.

80వ దశాబ్దంలో తెలంగాణా ప్రాతంలో సామజిక పరిస్థితులు,పేద ధనిక వర్గాల మధ్య తారతమ్యాలు, కట్టుబాట్ల నడుమ సామాన్యుడైన రాజు, దొరసాని దేవకి మధ్య నడిచే ప్రేమ కథా ప్రధానంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రం ద్వారా కేవీఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయమవుతుండగా సరేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో మధుర ఎంటర్‌టైన్మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్లపై మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం సమకూరున్నారు.

సంబంధిత సమాచారం :

More