హన్ శివ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం.1 ప్రారంభం

హన్ శివ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం.1 ప్రారంభం

Published on May 11, 2026 8:00 AM IST

హన్ శివ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న నూతన చిత్రం సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. టి.డి.ప్రసాద్ వర్మ దర్శకత్వంలో ఎన్.మహేశ్వరి, పి.జ్యోతి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి క్లాప్ కొట్టగా, నటుడు అలీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రముఖ దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.

​ఈ సందర్భంగా దర్శకుడు టి.డి.ప్రసాద్ వర్మ మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఓ విభిన్నమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. హీరో అనురాగ్ ఓ విలక్షణమైన పాత్రలో కనిపించనున్నారని, సీనియర్ నటుడు అలీ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారని వెల్లడించారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ తమ బ్యానర్‌లో వస్తున్న ఈ తొలి చిత్రం ఘన విజయం సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

​అనురాగ్, సంతోష్, సాయి విక్రాంత్, అలీ, చమ్మక్ చంద్ర, ఆటో రాంప్రసాద్, ఫణి, వినీత రెడ్డి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి టాన్ తేజ్ సంగీతం అందిస్తున్నారు. బాలు.ఆర్ సినిమాటోగ్రాఫర్‌గా, సునీల్ కుమార్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు