కూతురి ప్రేమ, పెళ్లి పై డైరెక్టర్ తేజా ఆసక్తికర వ్యాఖ్యలు.

Published on Jun 3, 2019 1:31 pm IST

ప్రేమ కథా చిత్రాలు తీయడంలో డైరెక్టర్ తేజ తరువాతే ఎవరైనా. కొత్త నటులతో చిత్రం, జయం ,నువ్వు నేను వంటి చిత్రాలు తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. తాజాగా కాజల్,బెల్లంకొండ శ్రీనివాస్ తో “సీత” మూవీ ని విడుదల చేసిన తేజా, ఓ ఇంటర్వ్యూ లో తన కూతురు ప్రేమ,పెళ్లి విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తన కూతురుతో తేజ నీకు ఇష్టం వచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకో అని చెప్పడం తో పాటు, ఒకవేళ తనతో నీకు జీవితం ఆనందంగా లేకపోతే తిరిగి వచ్చేయ్ అని చెప్పాడంట. పెళ్లికొచ్చిన బంధువుల కోసం,పక్కింటి వాళ్ళ కోసం మనసు చంపుకొని కాపురం చేయాల్సిన పనిలేదు అని ఓ సలహా ఇచ్చేశాడట.

అలాగే పెళ్ళిళ్ళ పేరిట ఆర్బాటం కోసం డబ్బులు ఖర్చు చేయనని తేజ అన్నారు. అలాగే ఈ జనరేషన్ పెద్ద స్టార్స్ ని హ్యాండిల్ చేసే కెపాసిటీ లేకపోవడం వలనే నేను వారితో సినిమాలు చేయడం లేదన్నారు. చెప్పడానికి ఇవ్వన్నీ ఒకే కానీ,ప్రాక్టికల్ గా ఇలాంటివి సాధ్యమంటారా చెప్పండి.

సంబంధిత సమాచారం :

More