మెగా కాంపౌండ్ లో సెటిల్ అయితే రేంజ్ అలా ఉంటుంది మరి..!

మెగా కాంపౌండ్ లో సెటిల్ అయితే రేంజ్ అలా ఉంటుంది మరి..!

Published on Mar 20, 2020 12:52 PM IST

mega family

టాలీవుడ్ బడా ఫ్యామిలీలలో మెగా ఫ్యామిలీ ఒకటి. అరడజనుకు పైగా హీరోలున్న మెగా ఫ్యామిలీలో దాదాపు చాల వరకు అందరూ తమ కంటూ ఓ ఇమేజ్ ఏర్పరుచుకున్నారు. చిరంజీవి,పవన్, రామ్ చరణ్, అల్లు అర్జున్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. వరుణ్ తేజ్, సాయి ధరమ్ సైతం ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. వీరి చిత్రాలు సైతం మంచి వసూళ్లను సాధిస్తున్నాయి. ఇక ఏ దర్శకుడైనా, మెగా కాంపౌండ్ లో సెటిల్ అయితే దశ తిరిగినట్టే. అలాంటి దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు.

ఆయన తన టాలెంట్ తో హీరో పవన్ కళ్యాణ్ కి బాగా దగ్గరయ్యారు. ఇప్పటికే త్రివిక్రమ్ మూడు సినిమాలు ఆయనతో తీయడం జరిగింది. అలాగే మరో మెగా హీరో అల్లు అర్జున్ తో కూడా ఆయన మూడు సినిమాలు చేశారు. వీటిలో రెండు హిట్ కాగా తాజాగా వచ్చిన అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్ అందుకుంది. త్రివిక్రమ్ దర్శకుడిగా 11 సినిమాలు తెరకెక్కించగా వాటిలో ఆరు సినిమాలు పవన్, బన్నీతో చేశారు. త్వరలో ఆయన చిరంజీవి, చరణ్ లతో కూడా చేయనున్నాడు. ఇక అరవింద సమేత చిత్రం నుండి ఎన్టీఆర్ దృష్టిని కూడా ఆకర్షించిన త్రివిక్రమ్ ఆయన 30వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇలా స్టార్ హీరోలతో మూవీస్ చేస్తూ త్రివిక్రమ్ దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తుంది.

తాజా వార్తలు