మళ్లీ ‘నాన్న’ కథేనా.. త్రివిక్రమ్ ?

Published on Mar 18, 2019 2:35 pm IST

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోయే సినిమాకు సంబంధించి అప్ డేట్స్ గురించి బన్నీ అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ చిత్రానికి ‘నాన్న నేను’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లుగా గత రెండు రోజులు నుంచీ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రం యొక్క రెగ్యూలర్ షూట్ ఏప్రిల్ నుండి ప్రారంభం కానుంది.

కాగా ఈ చిత్రం కూడా తండ్రి కొడుకుల మధ్య సాగే హై ఎమోషనల్ డ్రామా అని తెలుస్తోంది. గతంలో బన్ని- త్రివిక్రమ్ కలిసి చేసిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ కూడా తండ్రి కొడుకుల మధ్య కథే. అయితే ఆ కథలో చనిపోయిన ఫాదర్ ఎమోషన్ని పట్టుకొని కొడుకు జర్నీ ఉంటుంది. ఇక ఇప్పుడు చెయ్యబోయే సినిమాలో తండ్రి కొడుకులు మధ్య వచ్చే ఎమోషన్సే ప్రధానాంశంగా సినిమా ఉంటుందట.

తమన్ సంగీతం అందించనున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం :

More