మహేష్ ను మరోసారి కలవనున్న ఆ దర్శకుడు.!

Published on May 28, 2020 3:00 am IST

ఏ హీరోకి అయినా మైల్ స్టోన్ మూవీ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలి అనుకుంటారు. అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో మైల్ స్టోన్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది తన 25 వ చిత్రం “మహర్షి”. అభిమానులు 25 వ సినిమా ఎలా ఉండాలని భావించారో ఆ అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు వంశీ పైడిపల్లి మంచి హిట్ అందించారు.

కానీ తర్వాత కూడా మరో స్క్రిప్ట్ మహేష్ కోసం రెడీ చేస్తే మహేష్ కు పూర్తి స్థాయిలో నచ్చకపోవడంతో దానికి కాస్తా బ్రేక్ పడాల్సి వచ్చింది. దీనితో వంశీ ఎలా అయినా సరే మళ్ళీ మహేష్ తోనే సినిమా తియ్యాలని ఫిక్స్ అయ్యారట. అందుకే స్క్రిప్ట్ ను మళ్ళీ రీ డిజైన్ చేసి లేటైనా పర్లేదు మహేష్ తోనే సినిమా చెయ్యాలని అనుకుంటున్నారట అందుకే పూర్తి చేసిన స్క్రిప్ట్ ను మరోసారి మహేష్ ను కలవాలని అనుకుంటున్నారట. మరి ఈసారి వంశీ ట్రయిల్ జర్నీకి కామా పడుతుందో మళ్ళీ ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More