టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో వివి వినాయక్ ఒకరు. ఆయన దర్శకుడిగా ఆది, ఠాగూర్, దిల్, ఖైదీ నెంబర్ 150, అదుర్స్, లక్ష్మీ, క్రిష్ణ వంటి హిట్స్ మరియు ఇండస్ట్రీ హిట్స్ రూపొందించారు. ఐతే ఈ మాస్ చిత్రాల దర్శకుడు హీరోగా తెరంగేట్రం చేయనున్న సంగతి తెలిసిందే. దీని కోసం కొన్నిరోజులుగా వినాయక్ బరుడతగ్గడంతో పాటు, హీరో లుక్ కొరకు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. కాగా నిన్న జరిగిన సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిథులలో ఒకరికగా హాజరైన వినాయక్ కొత్త లుక్ లో దర్శనమిచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు.
డిఫరెంట్ హెయిర్ స్టైల్, గ్లాసెస్ పెట్టుకొని ఉన్న వినాయక్ వైవిధ్యంగా కనిపించారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయనను పోల్చుకోవడం కొంచెం కష్టం అనిపించిందని చెప్పొచ్చు. కాగా ఈ క్రేజి మూవీని ఏస్ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారని సమాచారం. ఇటీవల తిరుమల వెళ్లిన ఆయన ఈ విషయంపై స్పందించారట. త్వరలోనే ఈ మూవీ యొక్క పూర్తి వివరాలు తెలియజేయనున్నారు. ఈఏడాది చివర్లో ఈ చిత్రం సెట్స్ పైకెళ్లే అవకాశం కలదు. ఈ మాస్ దర్శకుడు హీరోగా ఏ మాత్రం అలరిస్తాడో చూడాలి.



