బాలకృష్ణ హీరోగా నిర్మాత సి.కళ్యాణ్ వివి వినాయక్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించటానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఎన్టీఆర్ బయోపిక్ తరువాత బాలయ్యతో తమ చిత్రాన్ని మొదలుపెట్టాలని వినాయక్, సి కళ్యాణ్ భావించారు. అయితే గతకొన్ని నెలలుగా ఈ చిత్రం పై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. బాలయ్యకి కథ నచ్చలేదని, సినిమా ఆగిపోయిందని బాలయ్య, ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బోయపాటి శ్రీనుతో తన తర్వాతి చిత్రం చేస్తున్నాడని కాబట్టి ఇక వినాయక్ తో సినిమా ఉండదని ఇలా చాలానే వినిపించాయి.
కాగా వివి వినాయక్ మీడియాతో మాట్లాడుతూ తన తర్వాత సినిమా బాలయ్యతోనే ఉంటుందని ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని స్పష్టం చేశారు. ఐతే బాలయ్యకు ఈ దర్శకుడు త్వరలోనే కథ చెప్పి ఒప్పించే ప్రయత్నం చేయనున్నాడట. ఈ చిత్రాన్ని నిర్మించిందే నిర్మాత సి.కళ్యాణ్ అని వినాయక్ తెలిపారు.


