ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ‘దృశ్యం’ వచ్చేనెల విడుదలకు సిద్ధమవుతుంది ఫిలింనగర్ వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా వచ్చే నెల 11న విడుదలకానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగించుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది
చాన్నాళ్ళ తరువాత టాలీవుడ్ లో మీనా హీరోయిన్ గా ఈ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా మలయాళ వెర్షన్ లో కూడా మీనానే కధానాయిక. నదియా ముఖ్య పాత్రలో కనిపించనుంది. మునుపటి తరం నాయిక శ్రీప్రియ ఈ సినిమాకు దర్శకురాలు
మలయాళ, కన్నడ వెర్షన్ లలో సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇక్కడ కూడా విజయం సాధించాలని కోరుకుందాం


