తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తోన్న ‘సర్కార్’ చిత్రం నవంబర్ 6న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ‘సర్కార్’ చిత్రానికి తమిళనాడు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని సంబంధించిన స్పెషల్ షోలకు తమిళనాడులో అనుమతి ఇవ్వాలని అక్కడి ప్రభుత్వాన్ని చిత్రబృందం కోరగా.. ప్రభుత్వం మాత్రం దీపావళిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఇబ్బందులు పడతాయని అందుకే ప్రభుత్వం నిరాకరించింది.
దీంతో విజయ్ అభిమానులు నిరాశ చెందారు. కాగా ఈ చిత్రంలో విజయ్ సరసన ‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రాదా రవి , వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే మణిరత్నం నవాబ్ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన అశోక్ వల్లభనేనినే, సర్కార్ చిత్రాన్ని కూడా తెలుగులో విడుదల చేస్తున్నారు.
