గోవాకి బై చెప్పిన డిస్కో రాజా

Published on Sep 15, 2019 10:25 am IST

హీరో రవితేజ దర్శకుడు వి ఐ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం డిస్కో రాజా. ఓ విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని సమాచారం. ఇటీవల చిత్రీకరణ నిమిత్తం గోవా వెళ్లిన చిత్ర యూనిట్ కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, పాటల చిత్రీకరణ కూడా చేశారని తెలుస్తుంది. ఐతే అక్కడ షెడ్యూల్ ముగియడంతో చిత్ర యూనిట్ తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారట. కొద్దిరోజుల విరామం తరువాత నెక్స్ట్ షెడ్యూల్ కి వెళతారని వినికిడి.

హీరో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ నటిస్తుండగా ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై రామ్ తళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 20న డిస్కో రాజా చిత్రం విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More