వికారాబాద్ లో షూట్ చేస్తోన్న ‘డిస్కోరాజా’ !

Published on Jun 4, 2019 12:44 pm IST

వి ఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా రాబోతున్న చిత్రం “డిస్కోరాజా”. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ ప్ర‌స్తుతం హైదరాబాద్ లో జ‌రుగుతుంది. నిన్న రామోజీ ఫిల్మ్‌ సిటీలో ర‌వితేజ‌, వెన్నెల కిషోర్ ల మ‌ద్య కీల‌క స‌న్నివేశాలు చిత్రీకరించారు. ఈ రోజు రేపు వికారాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ‌

ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మ‌రో హీరోయిన్ ఎంపిక ఇంకా జ‌ర‌గాల్సి వుంది. నిర్మాత‌ రామ్ తళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More