యాక్ష‌న్ స‌న్నివేశాల్లో ‘డిస్కోరాజా’ !

యాక్ష‌న్ స‌న్నివేశాల్లో ‘డిస్కోరాజా’ !

Published on May 29, 2019 4:00 AM IST

మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్న చిత్రం “డిస్కోరాజా”. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ ప్ర‌స్తుతం హైదరాబాద్ లో జ‌రుగుతుంది.

ఈ షెడ్యూల్ లో హీరో రవితేజతో ముఖ్య పాత్రధారులు పాల్గొంటున్నారు. హైద‌రాబాద్ అల్యూమినీయం ఫ్యాక్ట‌రీలో భారీగా వేసిన‌ సెట్ లో ప్ర‌స్తుతం హీరో, విలన్ మ‌ధ్య పోరాట స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ‌

ఈ చిత్రంలో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రామ్ తళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు