పూరి హీరోయిన్ బాడీ బిల్డింగ్ పోజులిస్తుందిగా…!

Published on Aug 28, 2019 4:00 pm IST

పూరి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన లోఫర్ చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది నటి దిశా పటాని. మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఆ చిత్రం జనాలను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తరువాత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ గా వచ్చిన ధోని చిత్రంతో బాలీవుడ్ లో అరంగేట్రం చేసిన ఈ భామ ఇక అక్కడే వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు తెరవైపు చూడలేదు.

ఐతే ఫిట్నెస్ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉండే దిశా జిమ్ లో కఠినమైన కసరత్తులు చేస్తూ జీరో సైజు బాడీ మెయింటైన్ చేస్తుంది. మరి అంత కష్టపడి సూపర్ షేప్ సాధించినప్పుడు దానిని ప్రదర్శించకపోతే ప్రయోజనమేముంది అనుకుందో ఏమో లేడీ బాడీ బిల్డర్ ఫోజులిస్తూ కుర్రకారుని వెర్రెత్తిస్తుంది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఈమె ఆదిత్య రాయ్ కపూర్ కి జోడిగా చేస్తున్న మలంగ్ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది.

సంబంధిత సమాచారం :