ఆఫోటోలు చూస్తే నాన్నచాలా ఇబ్బందిపడతారు అంటున్న హాట్ హీరోయిన్

Published on Jun 5, 2019 8:20 am IST

హాట్ బ్యూటీ దిశా పటాని దర్శకుడు పూరి,వరుణ్ తో చేసిన ‘లోఫర్’ మూవీ తో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా అంతగా విజయం సాధించకపోయినా, హిందీలో ‘ధోని’ బయోపిక్ లో నటించే ఛాన్స్ కొట్టేసి ఆ సినిమా విజయంతో వరుసగా హిందీలో సినిమాలు చేస్తూ పోతుంది. హీరోయిన్ కంటే కూడా సోషల్ మీడియా వేదికగా సూపర్ హాట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటూపోతుంది ఈ హాట్ బ్యూటీ.

సల్మాన్ ఖాన్ తో చేసిన ‘భరత్’ నేడు విడుదల కానున్న నేపథ్యం లో సినిమా ప్రమోషన్ కొరకు ఓ కార్యక్రమంలో పాల్గొన్న దిశా పటాని, తన పాపులారిటీ, సినిమాలు, తను సోషల్ మాధ్యమాల్లో పంచుకునే ఫోటోలపై కుటుంబ సభ్యుల స్పందన ఎలా ఉంటుంది అనే విషయం పై ఇంట్రెస్టింగ్ సంగతులు పంచుకున్నారు.

తన కుటుంబం తను చేసే సినిమా లను ఎప్పుడు గమనిస్తూ ఉంటుందట తను సినిమా లలో ఎలాంటి పాత్రలు చేసినా, అది నా వృత్తిలో భాగమే అని వాళ్ళకి తెలుసు అన్నారు. పొట్టిబట్టల్లో హాట్ ఫొటోస్ ని సోషల్ మీడియా లో, వాళ్ళ ఫ్యామిలీ గ్రూపులో షేర్ చేసినప్పుడు మాత్రం వాళ్ళ నాన్న ఇబ్బందిగా ఫీలవుతారట. ఎంతైనా నాన్న కదా అంటుంది ఈ బ్యూటీ. ఇంస్టాగ్రామ్ లో తన ఫొటోస్ ని వాళ్ళ అమ్మ గారు, చూస్తారట కానీ, ఆ ఫొటోలు ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడరట.

సంబంధిత సమాచారం :

More