పాత బస్తీ షెడ్యూలు పూర్తి చేసుకున్న “డిస్కో రాజా”

Published on Jun 16, 2019 3:01 am IST

మాస్ మహారాజ్ రవితేజ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘డిస్కో రాజా’. ఈ మూవీ షెడ్యూలు హైదరాబాద్ పాత బస్తీలో చిత్రీకరించారు . పాత బస్తీలో వేసిన ఓ ప్రత్యేకమైన సెట్లో హీరో రవితేజ మరియు ఇతర ముఖ్య తారాగణంపై సినిమాలోని మేజర్ పార్ట్ కి సంబందించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించారని సమాచారం. ఇటీవలే ఈ చిత్రంలో రవితేజ, కమెడియన్ వెన్నెల కిషోర్ కి మధ్య వచ్చే కొన్ని హాస్యసన్నివేశాలు రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించడం జరిగింది.

పాయల్ రాజపుట్, నభా నటేష్ రవితేజ సరసన నటిస్తుండగా,ఎస్ ఎస్ థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. అల్లరి నరేష్ ఓ ముఖ్యపాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది, కానీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.ప్రముఖ కమెడియన్ సునీల్,బాబీ సింహ,రాంకీ లు కూడా ఈ మూవీలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More