‘ఓటర్’ ని వేటాడుతున్న వివాదాలు.

Published on Jun 21, 2019 8:20 am IST

మంచు విష్ణు, సురభి జంటగా నటించిన చిత్రం ‘ఓటర్‌’. కార్తీక్‌ దర్శకత్వంలో జాన్‌ సుధీర్‌ పూదోట నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల అవుతోంది. ”ఓటర్‌’ సినిమా విడుదల హక్కులను సొంతం చేసుకున్న సార్థక్ మూవీస్ అధినేత ప్రశాంత్‌ గౌడ్‌ ,కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాని ఆపాలని బెదిరిస్తున్నారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా ఆపేది లేదు. అనుకున్న ప్రకారం నేడు విడుదల చేస్తున్నాం అని ఆరోపించారు.

ఈ మూవీ నిర్మాత జాన్ పూదోట మాట్లాడుతూ ఈ మూవీ స్క్రిప్ట్ విషయంలో కార్తీక్‌పై 24 ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థ సినిమాని ఆపాలంటూ వేసిన పిటిషన్‌ని కోర్టు తిరస్కరించింది. సినిమా విడుదల విషయంలో అభ్యంతరం చెప్పకుండా కోర్టు ఆర్డర్‌ కూడా ఇచ్చింది ఐనా కొందరు ఈ మూవీ విడుదలను ఆపాలని చూస్తున్నారు అని అన్నారు. ఇప్పటికే అనేక వివాదాలతో చాలా ఆలస్యమైన ఓటర్ మూవీకి మళ్ళీ ఇలాంటి కష్టాలు చుట్టుముట్టడం నిర్మాతలకు తలనొప్పిగా మారింది.

సంబంధిత సమాచారం :

More