ఫుల్ హ్యాపీగా ఉన్న మిర్చి డిస్ట్రిబ్యూటర్స్

ఫుల్ హ్యాపీగా ఉన్న మిర్చి డిస్ట్రిబ్యూటర్స్

Published on Mar 12, 2013 8:20 AM IST

Mirchi2
ఇటీవలి కాలంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలకు లాభాలు తగ్గాయనే చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య మూవీ రైట్స్ ని భారీ రేట్లకి అమ్ముతున్నారు, సినిమా పెద్ద హిట్ అయితే వారు పెట్టిన మార్జిన్ పాయింట్ ని క్రాస్ చేయగలుగుతున్నారు. ఉదాహరణకి .. ఎ పెద్ద స్టార్ట్ హీరో సినిమా అయినా కృష్ణా జిల్లా రైట్స్ 2.25 కోట్ల నుంచి 2.75 కోట్ల మధ్య అమ్ముడు పోతున్నాయి. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయితే మొత్తంగా 2.5కోట్ల నుంచి 3 కోట్ల వరకూ షేర్ వసూలు చేస్తోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘మిర్చి’ సినిమా మాత్రం ఇందుకు పూర్తి భిన్నమనే చెప్పుకోవాలి. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కి బాగా లాభాలు తెచ్చిపెట్టడంతో వాళ్ళు ఈ సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు. కృష్ణా జిల్లాలో మిర్చి మూవీ రైట్స్ సుమారు 1.75 -1.8 కోట్లకి కొనుక్కున్నారు. ఇప్పటికే ఈ సినిమా 2.35 కోట్ల కలెక్షన్ సాధించింది. మొత్తంగా ఈ సినిమా షేర్ 2.5 – 2.6 కోట్ల కలెక్షన్ మార్క్ ని క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. చెప్పాలంటే డిస్ట్రిబ్యూటర్స్ కి ఇది చాలా లాభదాయకమైన మూవీ.

సినిమాలు వరుసగా నిర్మించాలంటే రైట్స్ రీజనబుల్ రేట్స్ కి అమ్మితే ముందు ముందు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంకా మంచి రోజులు వస్తాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు