‘ఆదర్శ కుటుంబం’లో మున్నా భయ్యా.. ఎలాంటి రోల్ చేస్తాడో..?

‘ఆదర్శ కుటుంబం’లో మున్నా భయ్యా.. ఎలాంటి రోల్ చేస్తాడో..?

Published on May 10, 2026 12:31 AM IST

విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం గురించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్‌లో మున్నా భయ్యా పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ, ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడట. స్వయంగా ఆయనే ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు.

దివ్యేందు శర్మకు తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆయన ఇప్పటికే రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా, ఇప్పుడు వెంటనే వెంకటేష్-త్రివిక్రమ్ సినిమాలో అవకాశం దక్కించుకోవడం విశేషం. ఫ్యామిలీ క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉంది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. మరి ఈ సినిమాలో మున్నా భయ్యా ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో చూడాలి.

తాజా వార్తలు