వాల్మీకి లో వరుణ్ పాత్ర హరీష్ అలా డిఫరెంట్ గా…!

Published on Sep 18, 2019 4:22 pm IST

వాల్మీకి లో వరుణ్ గెటప్ చూసిన అభిమానులు భీభత్సమైన ఫైట్స్ ఊహించుకోవడం ఖాయం. గద్దలకొండ గణేష్ గా ఆయన సుదీర్ఘమైన పోరాట సన్నివేశాలలో కనిపిస్తారని మీరు అనుకొంటే పొరపాటే. వాల్మీకి లో అస్సలు పోరాటాలే ఉండవు. వాల్మీకి చిత్రంలో వరుణ్ పాత్ర భయం గొల్పేదిగా ఉంటుంది. శతృవులు భయపడతారు కానీ, ఆయన మనుషులను గాల్లోఎగరేసి కొట్టే సన్నివేశాలు మాత్రం ఉండవు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు హేరీష్ చెప్పడం జరిగింది.

కేవలం తన మేనరిజం తో విలన్స్ ని బయపెట్టేవిధంగా వాల్మికీలో వరుణ్ పాత్రను డిజైన్ చేశారట హరీష్. వరుణ్ సరసన పూజా నటిస్తుండగా ఆమె అందమైన లవ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కొద్దిసేపు మాత్రమే కనిపిస్తారని సమాచారం. 14రీల్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె మేయర్ అందిచారు. అధర్వ, బ్రహ్మజీ, బ్రహ్మనందం, సత్య ప్రధాన పాత్రలలో నటించారు.

సంబంధిత సమాచారం :

X
More