
ఇప్పుడు మన టాలీవుడ్ నుంచే కాకుండా మొత్తం మన సౌత్ ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ ఓటిటి రిలీజింగ్ సినిమాగా నిలిచింది “వి” చిత్రం. మొదటి సారి నాచురల్ స్టార్ నాని పూర్తి స్థాయి యాంటీ హీరోగా సుధీర్ బాబు మరో మెయిన్ లీడ్ లో కనిపిస్తున్న క్రైమ్ ఈ యాక్షన్ థ్రిల్లర్ కోసం చాలా మందే ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ విడుదలలో భాగంగా చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్ వేరే లెవెల్లో చేస్తున్నారు. అయితే అలా ప్రమోషన్స్ లో భాగంగా నాని ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
మామూలుగానే ఇలాంటి సినిమాలు అంటే మైండ్ బ్లోయింగ్ ట్విస్టులను అంతా ఆశిస్తారు. కానీ ఈ చిత్రంలో అలాంటివి ఉండవని ఈ సినిమా అంతా ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్టైనింగ్ గా ఉంటుందని నాని తెలిపారు. మొత్తానికి మాత్రం ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కోసం చాలా మందే ఎదురు చూస్తున్న ఈ చిత్రంలో నివేతా థామస్ మరియు అదితిరావు హైదరిలు ఫీమేల్ లీడ్స్ గా కనిపించనున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 5 కంటే ముందే 4 వ తారీఖున రాత్రి 9 గంటల 30 నిమిషాల నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్స్ పడనున్నట్టు తెలుస్తుంది.