ఎవ్వరిని డబ్బులు ఇవ్వాల్సిందిగా కొరవద్దు – మెహ్రీన్

ఎవ్వరిని డబ్బులు ఇవ్వాల్సిందిగా కొరవద్దు – మెహ్రీన్

Published on Aug 16, 2018 4:57 PM IST

Mehreenkaur

కేరళలో ప్రస్తుతం వ‌ర‌ద‌ల‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. వరద భాదితులకు సహాయార్ధం కొరకు మన స్టార్ హీరోలు ఆర్ధిక సహాయం చేస్తున్నారు. అలాగే హీరోయిన్ మెహ్రీన్ ఫ్యాన్స్ కొందరు ‘మెహ్రీన్ ఫ్యాన్స్ క్లబ్ విజయవాడ’ అనే పేరుతో వరద బాధితుల కోసం సహాయం చేయనున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఫ్యాన్స్ పోస్ట్ చూసిన మెహ్రీన్ స్పందిస్తూ.. ‘నా ఫ్యాన్స్ అందరికి నా రిక్వెస్ట్. దయచేసి భాదితుల పేరు చెప్పి ఎవ్వరిని డబ్బులు ఇవ్వాల్సిందిగా కొరవద్దు. మీ సేవా దృక్పదానికి నేను ఎంతో గౌరవిస్తున్నాను. కానీ డబ్బు డొనేట్ చేయడమనేది పర్సనల్ విషయం కదా. నా విషయానికి వస్తే ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండానే నేను సాయం చేశాను’ అని ఆమె పేర్కొంది.

తాజా వార్తలు