నాగ చైతన్య సినిమాకు ‘దోచేయ్’ టైటిల్ కన్ఫర్మ్..

Dohchay

సుధీర్ వర్మ దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తున్న సినిమాకు టైటిల్ ఖరారు చేశారంటూ పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. వాటిని దర్శకుడు ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. ఇకపై ఈ ప్రచారాలకు ఫుల్ స్టాప్ పడింది. నేడు ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా వెల్లడించారు.

ఈ సినిమాకు ‘దోచేయ్’ టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. యాక్షన్ & క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య దొంగగా కనిపిస్తారని సమాచారం. . ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. క్లైమాక్స్ & కొన్ని పాటలు షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉంది. ఈ సినిమాను మార్చి 20వ తేదిన విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారని ఫిల్మ్ ట్రేడ్ వర్గాల టాక్.
‘దోచేయ్’లో చైతు సరసన ‘1 నేనొక్కడినే’ ఫేం కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుంది. వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎస్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సన్నీ ఎంఆర్ సంగీత దర్శకుడు.

Exit mobile version