
‘తమ కుమార్తె సంతోషంగా ఉంటుందని వ్యయప్రయాసలను లెక్కచేయకుండా అమెరికా అబ్బాయిలకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు కొందరు తల్లిదండ్రులు. అలా అమెరికా వెళ్ళిన కొందరు కోడళ్ళు అరాచకాలకు బలవుతున్నారు. ప్రతి రోజు ఈ అంశాన్ని మనం వార్తలలో చూస్తున్నాం. ఇది ఒక కోణం మాత్రమె. కొందరు కోడళ్ళు మాత్రం అమెరికా వెళ్ళిన తర్వాత భర్తను అత్తమామల నుంచి నిర్దాక్ష్యణ్యంగా దూరం చేస్తున్నారు. వారిని ఎంతో వేదనకు గురిచేస్తున్నారు. డాలర్ కు మరోవైపు జరిగే ఈ కోణాన్ని మా సినిమాలో ఆవిష్కరిస్తున్నాం అంటున్నారు’ దర్శకుడు పూసల.
నాజర్, శ్రేయ, స్నేహ, యశ్వంత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా చివరిదశకు చేరుకుంది. సెప్టెంబర్ 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాత సత్యం తెలిపారు.