టైటిల్ చూసి ఉహించుకుంటే పొరపాటే !
Published on Mar 10, 2018 1:13 pm IST

నాని నటించిన తాజా చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు హిప్ హాప్ తమిజ సంగీతం అందించగా కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫి అందించాడు. ఈరోజు విడుదలైన కృష్ణార్జున యుద్ధం టీజర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. వినోదభరితంగా ఉన్న ఈ టీజర్ చూసి పలువురు మెచ్చుకుంటున్నారు. టైటిల్ చూసాక ఈ సినిమా ఎలా ఉంటుందో అనుకున్నారు అంతా కాని ఇది అవుట్ అండ్ అవుట్ కామెడి ఎంటర్టైనర్ సినిమా అని తెలుస్తోంది.

అనుపమ పరమేశ్వరన్ , రుక్షర్ మీర్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో నాని మాస్ లుక్ తోను క్లాస్ లుక్ తోను రెండు విభిన్నమైన పాత్రలను చేయడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏప్రిల్ 12 న మూవీ థియేటర్స్ లో సందడి చెయ్యనుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించడం జరిగింది.

 
Like us on Facebook