నా మీద రూమర్స్ ప్రచారం చేయద్దు – రకుల్

Rakul-Preet_Singh
2103లో వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీని కూడా ఆకర్షించిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఆ సినిమా సక్సెస్ తో టాలీవుడ్ లో బిజీ గర్ల్ గా మారిపోయిన రకుల్ ప్రీత్ వరుసగా హిట్ అందుకొని టాలీవుడ్ న్యూ గోల్డెన్ గర్ల్ గా మారింది. దాంతో ఈ భామ టాప్ హీరోయిన్ లీగ్ లో చేరడమే కాకుండా టాప్ హీరోలైన ఎన్.టి.ఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రవితేజ సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ భామ ఎన్.టి.ఆర్ – సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో రీసెంట్ గా తను రకుల్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఓకే పాయింట్ తీసుకొని తనకన్నా సీనియర్స్ అయిన త్రిష, తమన్నాలపై పలు కామెంట్స్ చేసిందనే వార్తలు కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్నాయి.

ఈ విషయం తెలుసుకున్న రకుల్ ప్రీత్ ఇవన్నీ రూమర్స్ అని కొట్టిపారేయడమే కాకుండా క్లారిటీ కూడా ఇచ్చింది. ‘నేను అసలు ప్రస్తుతం సిటీలోనే లేను, ఎప్పుడు ఎక్కడ మా సీనియర్ హీరోయిన్స్ గురించి మాట్లాడానో కాస్త చెప్పండి. అలాగే నేను మా సీనియర్స్ నటన చూసి వారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. అసలు వాళ్ళతో పోల్చుకోవడానేకే నేను సాహసం చేయను. వాళ్ళంటే నాకు గౌరవం మరియు నేను ప్రతి ఒక్క హీరోయిన్ తో చాలా క్లోజ్ గా ఉంటాను, అలాంటిది నేనెందుకు కామెంట్స్ చేస్తాను. దయ చేసి ఇలాంటి రూమర్స్ ని స్ప్రెడ్ చెయ్యద్దని’ రకుల్ ప్రీత్ తెలిపింది. రామ్ చరణ్, ఎన్.టి.ఆర్ సినిమాలను కొంతవరకూ పూర్తి చేసి సెప్టెంబర్ నుంచి అల్లు అర్జున్ మూవీ షూటింగ్ లో పాల్గొననుంది రకుల్ ప్రీత్ సింగ్.

Exit mobile version