‘దొరసాని’ నిలబడుతుందా ?

Published on Jun 27, 2019 1:00 am IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండను హీరోగా, అలాగే జీవితా రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మికను హీరోయిన్ గా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘దొరసాని’. జులై 12న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ మూవీ పై మంచి అంచనాలే ఉన్నాయి.

ముఖ్యంగా సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేస్తోన్న శివాత్మిక అద్భుతంగా నటించిందని.. ఈ సినిమా తరువాత శివాత్మికకి వరుస ఆఫర్స్ రావడం ఖాయమని చిత్రబృందం చెబుతుంది. అలాగే ఆనంద్ దేవరకొండ కూడా చాల సహజంగా నటించాడని.. ఈ జంట సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు. మరి నిజంగానే ఆకట్టుకుంటుందేమో చూడాలి. ఇక ఇప్పటికే విడుదలైన పాటలైతే బాగున్నాయి. ముఖ్యంగా ప్రశాంత్ ఆర్ విహారి అందించిన ట్యూన్స్ కూడా చాలా బాగున్నాయి. మరి ఈ ‘దొరసాని’ ఏ స్థాయిలో నిలబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More