దొరసాని ‘కళ్లల్లో కలవరమై’ ఆకట్టుకుంటుంది !

Published on Jun 25, 2019 1:00 am IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండను హీరోగా, అలాగే జీవితా రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మికను హీరోయిన్ గా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘దొరసాని’. జులై 12న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ శివాత్మక.

కాగా తాజాగా ఈ మూవీ నుండి సింగర్ చిన్మయి పాడిన పాట ‘కళ్లల్లో కలవరమై’సాంగ్ ని రెడియో మిర్చిలో లాంచ్ చేసారు. ఇప్పటికే రిలీజ్ అయిన ‘ నింగిలోన పాలపుంత నవ్వులొంపెనే’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక ‘ఒక స్వచ్ఛమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న దొరసానిలో పాటలు కథలో భాగంగా వస్తాయట. ప్రశాంత్ ఆర్ విహారి అందించిన ట్యూన్స్ చాలా బాగున్నాయట. మరి ఈ ‘కళ్లల్లో కలవరమై’ పాట కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుందేమో చూడాలి.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

X
More