బాలయ్య బర్త్ డేకి డబుల్ స్పెషల్ బొనాంజా!

బాలయ్య బర్త్ డేకి డబుల్ స్పెషల్ బొనాంజా!

Published on May 12, 2026 4:03 PM IST

Nandamuri-Balakrishna

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇప్పుడు తన కెరీర్ 111వ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్న సంగతి తెలిసిందే. వీరసింహా రెడ్డి తర్వాత మళ్ళీ వీరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రం తర్వాత 112వ చిత్రాన్ని కొరటాల శివతో బాలయ్య లాక్ చేసుకున్నారు.

అయితే ఈ రానున్న జూన్ నెలలో మాత్రం రెండు సినిమాలపై రెండు సాలిడ్ ట్రీట్ లు ఫ్యాన్స్ ని అలరించేందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. గోపీచంద్ తో చేస్తున్న సినిమా తాలూకా ఫస్ట్ గ్లింప్స్ మరియు టైటిల్ ని బాలయ్య పుట్టినరోజు కానుకగా జూన్ 10న లాంచ్ చేయనుండగా దీనితో పాటుగా కొరటాల ప్రాజెక్ట్ పై కూడా మేకర్స్ ఒక స్పెషల్ వీడియోని సిద్ధం చేస్తున్నారట. సో దీనితో రెండు ట్రీట్ లు అభిమానులకి బాలయ్య పుట్టినరోజు రానున్నాయి అని చెప్పవచ్చు.

తాజా వార్తలు