షూటింగ్ ముగించుకున్న ”డ‌బుల్ ఇస్మార్ట్”

షూటింగ్ ముగించుకున్న ”డ‌బుల్ ఇస్మార్ట్”

Published on Jul 5, 2024 11:58 AM IST


ఉస్తాద్ రామ్ పోతినేని న‌టిస్తున్న క్రేజీ సీక్వెల్ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’ ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో సాలిడ్ అంచ‌నాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాధ్ తెర‌కెక్కిస్తుండ‌టంతో ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి విజ‌యాన్ని అందుకుంటుందా అని అభిమానులు చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి మేక‌ర్స్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు.

ఇప్ప‌టికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్ట‌ర్స్, టీజ‌ర్, ఫ‌స్ట్ సాంగ్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా ఈ చిత్ర షూటింగ్ ముగిసినట్లు తెలిపారు. ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్ తో ఈ విష‌యాన్ని మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. ఇక‌ ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. ఈ సినిమాలో అందాల భామ కావ్య తాప‌ర్ హీరోయిన్ గా న‌టిస్తోంది.

ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ విల‌న్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా బాని జె, అలీ, గెట‌ప్ శ్రీ‌ను, షాయాజీ షిండే, మ‌క్రంద్ దేశ్పాండే త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తుండ‌గా పూరి క‌నెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి, పూరీ జ‌గ‌న్నాధ్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా ఆగ‌స్టు 15న వ‌ర‌ల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు