‘పెద్ది’ పై టార్గెటెడ్ నెగిటివిటీ.. ఇప్పుడు బట్టబయలు?

‘పెద్ది’ పై టార్గెటెడ్ నెగిటివిటీ.. ఇప్పుడు బట్టబయలు?

Published on Jun 20, 2026 5:00 PM IST

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా యువ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రమే పెద్ది. మంచి అంచనాలు నడుమ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్లో సోలో గా హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

అయితే ఈ సినిమా విడుదల అయ్యిన మొదటి రోజే కొన్ని విషయాల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. మెయిన్ గా జాన్వీ కపూర్ గ్లామ్ షో విషయంలో మాత్రం సోషల్ మీడియాలో ఒకింత ఎక్కువ నెగిటివిటీ అది కూడా నార్త్ సోషల్ మీడియా జనం టార్గెట్ చేసారు. అయితే తాజాగా వీరంతా లేటెస్ట్ బాలీవుడ్ సినిమా కాక్ టైల్ లో కృతి సనన్ అందాల ఆరబోతని మాత్రం ఆస్వాదిస్తున్నారు.

దీనితో టాలీవుడ్ ఫ్యాన్స్ దీనిని హైలైట్ చేస్తూ పెద్ది విషయంలో మాత్రం వాంటెడ్ నెగిటివిటీ జరిగిందని అంటున్నారు. ఇలా సోషల్ మీడియాలో పెద్ది విషయంలో నెగిటివ్ క్రియేషన్ కోసం మరోసారి చర్చకి దారి తీసింది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు