దృశ్యం-3 : ఓవర్సీస్ మార్కె్ట్‌ను దున్నేస్తున్న మోహన్ లాల్..!

దృశ్యం-3 : ఓవర్సీస్ మార్కె్ట్‌ను దున్నేస్తున్న మోహన్ లాల్..!

Published on Jun 1, 2026 11:03 PM IST

Drishyam-3

మిక్స్డ్ టాక్‌తో సంబంధం లేకుండా మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్‌లాల్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలో ప్రేక్షకులను భారీగా ఆకట్టుకుంటున్న ఈ ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ. 220 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. కేరళలోనే ఈ చిత్రం సుమారు రూ.76 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు అంచనా.

ఇక ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ చిత్రం ఊహించని రీతిలో ఏకంగా రూ.107 కోట్లు(11.2 మిలియన్ డాలర్లు) వసూలు చేసి సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి ఈ సినిమాకు అత్యధికంగా 6.3 మిలియన్ డాలర్ల వసూళ్లు రావడం విశేషం. మునుపటి భాగాల లాగా కాకుండా, ‘దృశ్యం 3’ చిత్రాన్ని ఇతర దక్షిణాది భాషల్లోకి కూడా డబ్ చేసి ఒకేసారి థియేటర్లలో విడుదల చేయడం ఈ స్థాయి కలెక్షన్లకు ప్రధాన కారణంగా నిలిచింది.

జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మీనా, సిద్ధిక్, ఆశా శరత్, మురళీ గోపి, అన్సిబా హసన్, ఈస్తర్ అనిల్ కీలక పాత్రలు పోషించారు. కథలో వచ్చే ఊహించని ట్విస్టులు, మోహన్‌లాల్ నటన ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. మొదటి రెండు భాగాల తరహాలోనే ఈ మూడో భాగం కూడా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతోంది.

తాజా వార్తలు