
విక్టరీ వెంకటేష్ ‘దృశ్యం’ సినిమా సక్సెస్ తో ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఈ సినిమాకి విమర్శకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో బాక్స్ ఆఫీసు వద్ద సపోర్ట్ పెరిగింది. దాంతో కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. అలాగే పబ్లిక్ మౌత్ టాక్ మరియు వెంకటేష్ – మీనా కాంబినేషన్ వల్ల థియేటర్స్ కి ఫ్యామిలీ ఆడియన్స్ ని రాబట్టుకుంటోంది. ఇలాంటి కథా బలం ఉన్న సినిమాలకి కొంతమంది ఆడియన్స్ బాగా ఎక్కువగా చూస్తారు.
ఈ సినిమా చాలా లో బడ్జెట్ తో తెరకెక్కింది. అలాగే ఈ సినిమాకి సంబదించిన వారికి మంచి లాభాలను తెచ్చి పెడుతోంది. మలయాళంలో మోహన్ లాల్ నటించిన సూపర్ హిట్ సినిమాకి ఇది రీమేక్. శ్రీ ప్రియ దర్శకత్వం వహించిన ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ – వైడ్ యాంగిల్ స్టూడియోస్ వారు కలిసి నిర్మించారు.