విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సస్పెన్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘దృశ్యం’. ఈ శుక్రవారం అనగా జూలై 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ సినిమాకి క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చారు. మలయాళంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘దృశ్యం’ కి ఇది రీమేక్.
లేడీ డైరెక్టర్ శ్రీ ప్రియ దర్శకత్వం వహించిన ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ వారు నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘రాముడు – భీముడు’ సినిమాలోని ఓ హిట్ సాంగ్ ని ఇందులో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా వాడుకున్నారు. వెంకటేష్ సరసన మీనా జోడీగా నటిస్తున్న ఈ సినిమాలో కుటుంబ ప్రేక్షకులకు నచ్చే అంశాలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను థ్రిల్ చేసే అంశాలు కూడా ఉంటాయని సమాచారం.


