విక్టరీ వెంకటేష్ ఈ శుక్రవారం విడుదలకానున్న ‘దృశ్యం’ సినిమాతో హిట్ అందుకునే క్రమంలో వున్నాడు. ఈ సినిమాను ఇండస్ట్రీలో ప్రముఖులకి ఒక ప్రత్యేక షో ప్రదర్శించారు. ఈ సినిమా కు పాజిటీవ్ వస్తుందని సమాచారం
ఈ సినిమా మలయాళంలో ఘనవిజయం సాధించింది. వెంకటేష్ మరియు మీనా ప్రధానపాత్రధారులు. ఈ సినిమా కుటుంబసమేతంగా చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది
సిరిప్రియ దర్శకురాలు డి రామానాయుడు సమర్పకుడు. సురేష్ బాబు మరియు వైడ్ యాంగిల్ ప్రొడక్షన్స్ నిర్మాతలు. ఈ సినిమాకు వస్తున్న స్పందన చూసి వెంకటేష్ హిట్ ఆశిస్తున్నారని సమాచారం


