విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘దృశ్యం’. నిన్న రాత్రి విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులలో ఆసక్తిని రేపింది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ట్రైలర్లో థ్రిల్లర్ ఎలెమెంట్స్ సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తిని కలగజేసింది. ట్రైలర్ హిట్ అవ్వడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
‘కొన్ని ఊహించని సంఘటనలు జరగడం వలన రాంబాబు(వెంకటేష్) కుటుంబం ప్రమాదంలో పడుతుంది. ఒక పోలీస్ ఆఫీసర్ కావాలనే రాంబాబు కుటుంబాన్ని మర్డర్ కేసులో ఇరికించడానికి ప్రయత్నిస్తుంటారు. అప్పుడు తన ఫ్యామిలీను సేవ్ చేయడానికి రాంబాబు ఎం చేసాడు..? అనేది సినిమా కథ అని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది.
‘దృశ్యం’ చిత్రంలో వెంకటేష్ ఎంత వరకు చదువుకున్నాడు..? అనే అంశం కీ-రోల్ ప్లే చేయబోతుంది. ట్రైలర్ చివరలో నదియ చెప్పిన ‘నాల్గవ తరగతి చదివిన వాడి తెలివితేటలు ఇలా ఉండవు’ అనే డైలాగ్ ప్రేక్షకులలో ఆసక్తి రేపడానికి ప్రధాన కారణం. వెంకి తెలివితేటలకు ‘దృశ్యం’ పరీక్ష పెడుతుందనమాట. సీనియర్ హీరోయిన్ శ్రీప్రియ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆడియో త్వరలో విడుదల కానుంది. సినిమా జూలై 11న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.


