సీడెడ్ లో ఎదురులేకుండా సాగుతున్న దృశ్యం

సీడెడ్ లో ఎదురులేకుండా సాగుతున్న దృశ్యం

Published on Jul 23, 2014 10:10 AM IST

DRUSHYAM
ఆంధ్రప్రదేశ్ లో చాలా ఏరియాలలో విక్టరీ వెంకటేష్ నటించిన ‘దృశ్యం’ సినిమా ఎదురనేది లేకుండా సాగుతుంది. ఫ్యామిలీ డ్రామాలను ఆదరించే ప్రేక్షకులుగా పేరొందిన సీడెడ్ ఏరియాలో ఈ సినిమా చాలా స్ట్రాంగ్ గా నడుస్తుంది.

సినిమాలో దాగున్న సస్పెన్స్, నటీనటుల పెర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి చాలా దోహదపడుతున్నాయి. ఈ చిత్రం ఇప్పటికే పెట్టిన డబ్బుని వెనక్కి సంపాదించి లాభాల బాట పయనిస్తుంది.

ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో వెంకీ సరసన మీనా నటించింది. శ్రీప్రియ దర్శకురాలు. సురేష్ బాబు మరియు వైడ్ యాంగిల్ సంస్థలు నిర్మాతలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు