ఫుల్ స్వింగ్ లో వెంకీ మామ “దృశ్యం 2”.!

Published on Mar 17, 2021 11:00 am IST

లేటెస్ట్ గా మళయాళంలో వచ్చిన “దృశ్యం 2” ఓటిటిలో ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యి ఇండియన్ సినిమాలో పర్ఫెక్ట్ సీక్వెల్ అంటే ఇది అనేలా పేరు తెచ్చుకుంది.

అయితే మొదటి పార్ట్ “దృశ్యం”కు రీమేక్ గా మన తెలుగులో మోస్ట్ లవబుల్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కించగా మన దగ్గర కూడా బార్ హిట్టయ్యింది. మరి మళయాళంలో సీక్వెల్ కూడా మంచి హిట్ కావడంతో దీనికి సీక్వెల్ ను తెలుగులో కూడా ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా మొదలు పెట్టేసారు.

ఇప్పుడు ఈ చిత్రం తాలూకా షూట్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. తెలుగులో కూడా జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రస్తుతం వెంకటేష్, మీనా, నటుడు సంపత్ సహా నదియా, నరేశ్ లతో పాటు ఇతర కీలక పాత్రధారులు అంతా పాల్గొన్నారు. మరి ఈ ఇంట్రెస్టింగ్ చిత్రాన్ని మేకర్స్ శరవేగంగా పూర్తి చేసి విడుదల చేసే యోచనలో ఉన్నారు.

సంబంధిత సమాచారం :