వెంకీ ప్లాన్స్ అన్నీ మార్చుకున్నారా ?

Published on May 25, 2021 6:03 pm IST

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. వాటిలో ఆల్రెడీ రెండు కంప్లీట్ అయ్యాయి కూడ. అవే ‘నారప్ప, దృశ్యం 2’. వీటిలో ముందుగా పూర్తైంది ‘నారప్ప’ చిత్రం. తమిళ హిట్ మూవీ ‘అసుర’కు ఇది రీమేక్. ఈపాటికే ఈ చిత్రం రిలీజ్ కావాల్సింది. కానీ లాక్ డౌన్ మూలంగా, థియేటర్లు మూతబడిన కారణంగా ఆగిపోయింది. దీంతో చిత్ర బృందం కొత్త రిలీజ్ డేట్ చూసుకుంటున్నారు.

ఈ సినిమా కంప్లీట్ అయ్యాక ‘దృశ్యం 2’ రీమేక్ స్టార్ట్ చేశారు. కేవలం నెలన్నర రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ సినిమాకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీ నుండి మంచి ఆఫర్లు వస్తున్నాయట. దీంతో వెంకీ ముందుగా ‘దృశ్యం 2’ను ఓటీటీలో రిలీజ్ చేసి పరిస్థితులు చక్కబడి, సినిమా హాళ్లు తెరుచుకున్నాక ‘నారప్ప’ను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ రెండు సినిమాల తర్వాత ‘ఎఫ్ 3’ ను విడుదల చేయనున్నారు. మొత్తానికి లాక్ డౌన్ ప్రభావంతో వెంకీ ప్లాన్స్ అన్నీ మారిపోయాయన్నమాట.

సంబంధిత సమాచారం :