
విక్టరీ వెంకటేష్ నటించిన ఎమోషనల్ థ్రిల్లర్ ‘దృశ్యం’ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి స్పందన రాబట్టుకుంటుంది. మలయాళం లో విడుదలైన ‘దృశ్యం’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగు లో రీమేక్ చేసారు. గత వారం విడుదల అయిన ఈ చిత్రం ఇప్పుటికే నిజాం లో 3 కోట్ల 40 లక్షలు సంపాదించింది.
ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఆంధ్ర తెలంగాణా లతో పాటు ఓవర్సీస్ లో కూడా విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. శ్రీ ప్రియ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనా నదియా లతో పాటు కృతిక ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని సురేష్ బాబు రాజ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు.