
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన సినిమా మరియు చాలా రోజుల తర్వాత అభిమానులు కాలర్ ఎగరేసుకొని తిరిగేలా చేసిన సినిమా ‘గబ్బర్ సింగ్’. ఈ సినిమా విడుదలైన కొద్ది రోజులకే ఈ సినిమాలోని పవన్ కళ్యాణ్ పాత్ర అందరికీ బాగా నచ్చడంతో, అదే పాత్రని బేస్ చేసుకొని మరో సినిమా చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. చాలా రోజుల నుంచి వెనక్కి వెళుతూ వస్తున్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే ముహూర్తం దగ్గర పడుతోంది. నిన్ననే ఈ సినిమాని 2016 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నామని రిలీజ్ డేట్ ని లాక్ చేసేసారు. అలాగే ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టేలా ప్లాన్ చేస్తున్నామని ఈ చిత్ర టీం తెలిపింది. పవర్ సినిమాతో పరిచయమైన బాబీ పవన్ కళ్యాణ్ ని డీల్ చేయనున్నాడు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబందించిన మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. గబ్బర్ సింగ్ సూపర్ హిట్ ఆల్బం అందించిన దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రసతుతం దేవీశ్రీ ప్రసాద్ – బాబీ కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ లో బిజీగా ఉంటూ పవన్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా సాంగ్స్ ని కంపోజ్ చేసే పనిలో ఉన్నారు. అన్ని ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను ఒకేసారి ఫినిష్ చేసుకొని పక్కా ప్లాన్ తో సెట్స్ పైకి వెళ్ళేలా చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాలో పవన్ సరసన ఇద్దరు భామలు కనిపించనున్నారు. అందులో ఒక హీరోయిన్ గా అనీషా అంబ్రోసేని ఫైనలైజ్ చేయగా రెండవ హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోంది. శరత్ మరార్ ఈ సినిమాకి నిర్మాత.

