“ఖిలాడి”కి ఒక్క గంటలో మ్యూజిక్ కంప్లీట్.!

Published on Feb 9, 2022 5:30 pm IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “ఖిలాడి”. ఈ శుక్రవారం రిలీజ్ కి రెడీగా ఉన్న చెప్పుకోదగ్గ సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఇదే అని చెప్పాలి. దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం తన కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో మరియు భారీ యాక్షన్ డ్రామాగా దీనిని ప్లాన్ చేసారు. మరి ఈ సినిమా నుంచి రీసెంట్ గా విడుదల అయ్యిన ట్రైలర్ కి గాను సాలిడ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఇందులో స్పెషల్ అట్రాక్షన్ గా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచి హైలైట్ గా నిలిచింది అని చెప్పాలి. అలాగే ఈ సినిమాకి తాను ఇచ్చిన సాంగ్స్ కూడా ప్రతీది మంచి హిట్ అయ్యింది. మరి ఇలాంటి క్రేజీ ఆల్బమ్ పై దర్శకుడు రమేష్ వర్మ ఇంట్రెస్టింగ్ డీటెయిల్ రివీల్ చేశారు.

ఈ సినిమాకి గాను ట్యూన్స్ కోసం దేవితో మాట్లాడగా కేవలం ఒక్క గంటలో టోటల్ ఆల్బమ్ గా ఆరు పాటలని సెట్ చేసి తనకి వినిపించేసాడట. అందులో ఐదు పాటల్ని ఈ సినిమాకి తాము ఫైనల్ చేసుకున్నట్టు తెలిపారు. దీనితో దేవి ఎక్స్ పీరియన్స్ అండ్ టాలెండ్ ఏ లెవెల్లో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం :