
టాలీవుడ్ ఎనర్జిటిక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ తన అభిమానుల కోసం యుఎస్, కెనడాలో పర్యటించి స్పెషల్ షోస్ చేయనున్నాడు. ఈ షోస్ జూలైలో మొదలై ఆగష్టులో మొదలవుతాయి. ఇందులో భాగంగా ఈ రెండు దేశాల్లో చాలా సిటీస్ లో తన షోస్ జరగనున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్స్ ఇలాంటి టూర్స్ వేయడం అనేది కొత్త విషయం కాదు కానీ ఈ మధ్య కాలంలో టాలీవుడ్ నుంచి ఒక టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇలాంటి ప్రోగ్రాం చేయకపోవడంతో దేవీశ్రీ షోస్ కి ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ టూర్ లో దేవీశ్రీ ఎక్కడెక్కడ షోస్ చేయనున్నాడు అనే వివరాలు త్వరలోనే తెలియజేస్తారు. మామూలుగా ఆడియో ఫంక్షన్స్ లోనే చాలా యాక్టివ్ గా పాటలు పాడుతూ స్టెప్పులేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తాడు. అలాంటి దేవీశ్రీ ఈ లైవ్ ఈవెంట్స్ లో తన అభిమానులను బాగా ఎంటర్ టైన్ చేస్తాడని ఆశించవచ్చు.
ఇది కాకుండా ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. దేవీశ్రీ ప్రసాద్ త్వరలోనే గబ్బర్ సింగ్ 2′, త్రివిక్రమ్ – అల్లు అర్జున్, మహేష్ బాబు- కొరటాల శివ సినిమాలకి మ్యూజిక్ అందించనున్నాడు.

