మరోసారి మ్యాజిక్ రిపీట్ చేసే పనిలో రామ్

Published on Apr 16, 2021 12:14 am IST

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుని ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాస్త ఉస్తాద్ రామ్ అయిపోయాడు. ఈ సినిమాతో యాక్షన్ హీరోగా సెటిలవ్వానుకున్న రామ్ ఆశలకు గట్టి పునాది పడింది. ఆ తర్వాత చేసిన ‘రెడ్’ సినిమా కూడ మంచి ఫలితాన్నే ఇచ్చింది. దీంతో ఈసారి చేయబోయే సినిమాతో ఇంకొక మెట్టు ఎక్కాలనుకున్న ఆయన తమిళ దర్శకుడు లింగుస్వామితో వర్క్ చేయడానికి రెడీ అయ్యాడు. లింగుస్వామి యాక్షన్ సినిమాలు తీయడంలో మంచి పట్టున్న దర్శకుడు. అందుకే ఆయన్ను చూజ్ చేసుకున్నాడు రామ్.

ఒక్క డైరెక్టర్ విషయంలోనే కాదు మ్యూజిక్ డైరెక్టర్ విషయంలోనూ పక్కాగా ఉన్నాడు రామ్. ఈ చిత్రానికి రామ్ ఫెవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందివ్వనున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘జగడం, రెడీ, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురూ ప్రేమకోసమే, నేను శైలజ, శివమ్’ లాంటి సినిమాలు వచ్చాయి. మ్యూజిక్ పరంగా ఈ చిత్రాలన్నీ విజయవంతమైనవే. అందుకే ఈసారి కూడ ఆ మ్యాజిక్ రిపీట్ చేయడానికి ఇద్దరూ చేతులు కలిపారు. తెలుగు, తమిళం రెండు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయకిగా నటించనుంది.

సంబంధిత సమాచారం :