సుక్కు స్ట్రాంగ్ అయిన ఫ్లేవర్ లోనే దేవీశ్రీ మూవీ

సుక్కు స్ట్రాంగ్ అయిన ఫ్లేవర్ లోనే దేవీశ్రీ మూవీ

Published on Nov 29, 2015 5:55 PM IST

devi-sri-prasad

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్.. ప్రస్తుతం తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వెలుగొందుతున్న రాక్ స్టార్. తన సినిమాలలోని పాటలతోనే కాదు ఒక్కసారి స్టేజ్ ఎక్కాడంటే ఆడిటోరియంలోని ఆడియన్స్ గోల చేయాల్సిందే. దేవేశ్రీ మ్యూజిక్ అందించిన కుమారి 21F రీసెంట్ గా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు దేవీశ్రీ ప్రసద్ డి హీరోగా పరిచయం చేయనున్నానని, సుకుమార్ ఆ సినిమాకి దర్శకత్వం వహిస్తాడని ఇది వరకే తెలియజేశాం.

ప్రస్తుతం నాన్నకు ప్రంతో షూటింగ్ లో బిజీగా ఉన్న సుకుమార్ ఆ సినిమా పూర్తయ్యాక దేవీశ్రీ ప్రసాద్ సినిమాపై దృష్టి సారిస్తాడు. మాకు అందిన సమాచారం ప్రకారం సుకుమార్ దేవీశ్రీ ప్రసాద్ తో ఎలాంటి సినిమా చేయాలో ఫిక్స్ అయ్యాడట. సుకుమార్ ఇప్పటికే ది బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఫార్మాట్ లోనే చేయడానికి ఫిక్స్ అయ్యాడట. దిల్‌రాజు – సుకుమార్‌ల కాంబినేషన్‌లో అందులోనూ హీరో దేవిశ్రీ అంటే ఈ కాంబినేషన్ వినడానికే చాలా క్రేజ్ ని క్రియేట్ చేస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

తాజా వార్తలు