డబ్బింగ్ మొదలెట్టిన నాగ శౌర్య‌ !

naga

యూత్ హీరో నాగ శౌర్య‌, బ‌బ్లీ బ్యూటీ మెహ‌రిన్ జంట‌గా ఐరా క్రియేష‌న్స్ ప‌తాకం పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌లుగా ప్రొడ‌క్ష‌న్ నెం 3 రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. నూత‌న ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ తేజ ఈ సినిమాతో తెలుగు తెరకు ప‌రిచ‌యం అవుతున్నారు. కాగా తాజాగా ఈ చిత్రం డబ్బింగ్ కార్య క్రమాలను మొదలు పెట్టింది. నాగశౌర్య ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ చెబుతున్నారు.

ఇక అటు క్లాస్ ఇటు మాస్ ఆడియెన్స్ ని అల‌రించాల‌నే ఉద్దేశంతో ఈ సినిమాలో కాస్త ఎక్క‌వుగానే యాక్ష‌న్ స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నారు. కాగా ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌లే వైజాగ్ లో ఈ సినిమాకి సంబంధించిన ఓ భారీ యాక్ష‌న్ సీన్ షూట్ చేశారు. ఆ యాక్ష‌న్ సన్నివేశాల్ని చాలా అద్భుతంగా వచ్చాయని ద‌ర్శ‌కనిర్మాత‌లు చెబుతున్నారు.

ఇక నిర్మాత ఉషా ముల్పూరి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారట. ఈ చిత్రంలో నాగ‌శౌర్య సరసన హీరోయిన్ గా మెహరీన్ నటిస్తుంది. ‘ఎఫ్ 2’ తరువాత మెహరీన్ చేస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. మొత్తానికి మెహ‌రిన్ హీరోయిన్ గా మ‌రోసారి ప్రేక్ష‌కుల అలరించబోతుంది. పోసాని కృష్ణ‌ముర‌ళీ, స‌త్య‌, త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ శ్రీ‌చ‌ర‌ణ్‌, కెమెరా మ‌నోజ్‌ రెడ్డి, ఎడిట‌ర్‌ గారీ బిహెచ్‌, డైరెక్ష‌న్ ర‌మ‌ణ్‌ తేజ‌, ప్రొడ్యూస‌ర్ ఉషా ముల్పూరి,

Exit mobile version