‘రుద్రమదేవి’కి మొదలైన డబ్బింగ్

‘రుద్రమదేవి’కి మొదలైన డబ్బింగ్

Published on Sep 9, 2014 11:28 PM IST

Rudrama-Devi

భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ దాదాపు 9 సంవత్సరాలు రీసర్చ్ చేసి తెరకెక్కించిన సినిమా ‘రుద్రమదేవి’. ఇండియాలోనే మొట్టమొదటి సారిగా గుణశేఖర్ స్టీరియో స్కోపిక్ ద్వారా తెరకెక్కిస్తున్న హిస్టారికల్ 3డి మూవీ ‘రుద్రమదేవి’. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. షూటింగ్ పూర్తయ్యే సమయానికే పలు విభాగాలకు సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి.

షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఎక్కువ రోజులు గ్యాప్ తీసుకోకుండా ఈ చిత్ర టీం డబ్బింగ్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టారు. నిన్న శబ్దాలయ స్టూడియోస్ లో ఈ చిత్ర టీం లాంఛనంగా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేసిన నటీనటుల డబ్బింగ్ వర్క్ జరుగుతోంది.

అనుష్క, రానా ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమాలో అల్లు అర్జున్, కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు