‘అరవింద సమేత’ డబ్బింగ్ పనులు మొదలయ్యాయి !
Published on Jun 18, 2018 11:43 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘అరవింద సమేత’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే 40 శాతం వరకు చిత్రీకరణ ముగియగా ఈరోజు నుండి డబ్బింగ్ కార్యక్రమాలను మొదలుపెట్టారు చిత్ర యూనిట్.

త్రివిక్రమ్ స్పీడు చూస్తుంటే సినిమా ఎలాంటి ఆలస్యం లేకుండా అక్టోబర్ నెలలోనే ప్రేక్షకుల ముందుకొచ్చేలా ఉంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్లో ఉండబోతున్న ఈ సినిమాలో తారక్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తారని వార్తలు వస్తున్నా.. వాటిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook