ఎన్.టి.ఆర్ ‘టెంపర్’ కి మొదలైన డబ్బింగ్

ఎన్.టి.ఆర్ ‘టెంపర్’ కి మొదలైన డబ్బింగ్

Published on Dec 9, 2014 11:31 AM IST

Temper-(2)
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న సినిమా ‘టెంపర్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాని తక్కువ టైంలో ఫినిష్ చేసి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ చిత్ర టీం డే అండ్ నైట్ షూట్ చేసింది. అనుకున్న రిలీజ్ డేట్ కి తక్కువ టైం ఉండడంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా షూటింగ్ తో పాటే ఫినిష్ చేస్తున్నారని ఇదివరకే తెలియజేశాం.

వీటితో పాటు ఈ చిత్ర టీం డబ్బింగ్ కార్యక్రమాలను కూడా ప్రారంభించింది. నిన్న ఈ చిత్ర టీం మెంబర్స్ శబ్దాలయ స్టూడియోస్ లో పూజ కార్యక్రమాలతో డబ్బింగ్ పనులను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ చిత్ర టీంలోని కీలక నటీనటులకు సబందించిన డబ్బింగ్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఎన్.టి.ఆర్ కూడా తన పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ ని మొదలు పెట్టనున్నాడు. ఎన్.టి.ఆర్ పోలీస్ ఆఫీసర్ గానే కాకుండా సరికొత్త మేకోవర్ తో స్టైలిష్ లుక్ లో కూడా కనిపించనున్నాడు. ఆ లుక్ కి సంబందించిన ఫోటోలు ఇటీవలే విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసాయి.

ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘బాద్షా’ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ ఎన్.టి.ఆర్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు