‘జనతా హోటల్ ‘తో రానున్న దుల్కర్ సల్మాన్ !

‘జనతా హోటల్ ‘తో రానున్న దుల్కర్ సల్మాన్ !

Published on Jul 9, 2018 4:00 PM IST

Dulquer Salmaan1

వరుసగా విజయవంతమైన చిత్రాలు అందించడం అంటే ఆషామాషీ కాదు. పైగా, కేవలం కమర్షియల్ హిట్ చిత్రాలుగా మాత్రమే కాకుండా, ప్రేక్షకుల హృదయాలను కూడా తాకే చిత్రాలుగా పేరు తెచ్చుకోవడం అంటే చిన్న విషయం కాదు. ‘ప్రేమిస్తే’ నుంచి ”శoభో శంకర’ మూవీ వరకు సురేష్ కొండేటి అందించిన చిత్రాలూ ఈ కోవకే వస్తాయి. ఫీల్ గుడ్ కమర్షియల్ ఎంటర్ టైనర్స్ గా ఇలా సురేశ్ అందించిన అన్ని చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుని ఆయనకు మంచి నిర్మాత అనే పేరు తెచ్చాయి. ఇప్పుడు ఆయన తాజాగా ‘జనతా హోటల్’ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘మహానటి’ మూవీ తరువాత దుల్కర్ సల్మాన్ కు మంచి పేరు తెచ్చి పెట్టె గొప్ప చిత్రమిది.

‘ఓకే బంగారం’తో తెలుగు, తమిళ ప్రేక్షకులతో హిట్ పెయిర్ అనిపించుకున్న దుల్కర్ సల్మాన్, నిత్య మీనన్ జంటగా రూపొందిన సూపర్ హిట్ మలయాళ చిత్రం ‘ఉస్మాద్ హోటల్’. ఈ చిత్రాన్ని ‘జనతా హోటల్’ పేరుతో తెలుగులోకి అనువదించారు నిర్మాత సురేష్ కొండేటి. అన్వర్ రషీద్ తెరకెక్కించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెలలో విడుదలకు సిద్ధమైంది.

చిత్ర నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ మలయాళంలో మంచి మ్యూజికల్ హిట్ గా నిలిచిన చిత్రం ఇది. కథ-కథనంతో పాటు దుల్కర్, నిత్యామీనన్ల జంట ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. లవ్, సెంటిమెంట్, పేద, ధనిక వర్గాల మధ్య ఉండే భేదం.. తదితర అంశాల సమాహారంతో రూపొందిన చక్కని ఫీల్ గుడ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది. సాహితి రాసిన సంభాషణలు హైలైట్ గా నిలుస్తాయి. మా సంస్థలో వచ్చిన ‘జర్నీ’, ‘పిజ్జా’, ‘డా. సలీమ్’ చిత్రాలకు ఆయన మంచి సంభాషణలు అందించారు. ఇప్పుడు ‘జనతా హోటల్’కి కూడా అద్భుతమైన మాటలు రాశారు. అలాగే ఈ చిత్రానికి గోపీ సుందర్ స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తాయని వివరించారు.

తాజా వార్తలు